CHRIST CHURCH,PEDDAPURAPPADU

            CBT PEDDAPURAPPADU STUDENTS

 నన్ను వెంబడింపగోరిన యెడల ,తన్ను తను ఉపెక్షించుకొని ,తన  సిలువనెత్తుకొని నన్ను వెంబడిపవలెను   



హాయ్ ఫ్రెండ్స్ మనం ఎల్లప్పుడు దేవునిపనిలో ఉండాలి మనం పుట్టింది దేవునికోరకే కావున మనం దేవుని పనిలో ఉండాలి దేవుని పని అనగా సువార్త ప్రకటించుట మది పెద్దాపురప్పాడు మేము  పల్లె పల్లెకు సువార్త ప్రోజేక్టర్స్ ద్వార ప్రకటిస్తునము మేము తక్కుమంది స్టూడెంట్స్ మాత్రమే మేము దేవుని పనిని ముందికి తిసుకేల్లలని  ప్రార్ధించండి ,
  















Matthew(మత్తయి సువార్త) 10:16
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి. 
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,
వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.
వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.
మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును




Romans(రోమీయులకు) 5:4
శ్రమలయందును అతిశయపడుదము.
Psalms(కీర్తనల గ్రంథము) 90:15
నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము.
Psalms(కీర్తనల గ్రంథము) 119:75
యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.
Psalms(కీర్తనల గ్రంథము) 119:67
శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.
Acts(అపొస్తలుల కార్యములు) 14:22
శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
Acts(అపొస్తలుల కార్యములు) 20:23
బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
Romans(రోమీయులకు) 8:17
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
Romans(రోమీయులకు) 12:12
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 1:5
క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 8:2
ఏలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
Philippians(ఫిలిప్పీయులకు) 1:30
క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.
1 Peter(మొదటి పేతురు) 4:1
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
1 Peter(మొదటి పేతురు) 3:14
మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;

    BIBLE RESEARCH CENTER PEDDAPURAPPADU STUDENTS 


                                                                                                                                                  

                                                                                 





               

     






                 
           
















Comments

Popular posts from this blog